'దేవర' కోసం రంగంలోకి మరో విలన్!
- ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'దేవర'
- కథానాయికగా జాన్వీ కపూర్ పరిచయం
- సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్
- వచ్చే ఏప్రిల్ 5వ తేదీన విడుదల
ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రకి గాను సైఫ్ అలీఖాన్ ను తీసుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. ఇక కథ ప్రకారం హీరోను మరో ట్రాక్ లో ఎదుర్కునే మరో విలన్ కూడా ఉంటాడట. ఆ పాత్రకిగాను మలయాళ నటుడు 'షైన్ టామ్ చాకో'ను తీసుకున్నారని అంటున్నారు. ఇటీవల వచ్చిన 'దసరా' సినిమాలో ఆయనే విలన్.
ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ జాలరి గూడానికి చెందిన యువతిగా కాస్త డీ గ్లామర్ పాత్రలో కనిపించనుందని అంటున్నారు. శ్రీకాంత్ .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. వచ్చే ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.