Krishna: మహేశ్ చేతుల మీదుగా 'మోసగాళ్లకు మోసగాడు' ట్రైలర్ రిలీజ్!

  • 'గూఢచారి 116'తో ప్రయోగాలు మొదలెట్టిన కృష్ణ
  • మోసగాళ్లకు మోసగాడు'తో కౌబోయ్ సినిమాల ట్రెండ్ 
  • అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం 
  • ఈ నెల 31న కృష్ణ జయంతి 
  • ఆ సందర్భంగా అభిమానుల ముందుకు వస్తున్న సినిమా
Mosagallaku Mosagadu Trailer Released

కృష్ణ తన కెరియర్ తొలినాళ్లలోనే 'గూఢచారి 116' సినిమాను చేసి, తెలుగు తెరకి ఒక మంచి యాక్షన్ హీరో దొరికాడని అందరూ అనుకునేలా చేశారు. ఆ తరువాత 'మోసగాళ్లకు మోసగాడు'; సినిమాతో తెలుగు తెరకి కౌబోయ్ కథలను పరిచయం చేశారు. అప్పట్లో ఈ సినిమాలోని కృష్ణ లుక్ .. గుర్రపు స్వారీలు .. భారీ చేజింగులు చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. 

కృష్ణ ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించారు. కే ఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కృష్ణ సరసన నాయికగా విజయనిర్మల నటించారు. 1971లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆదినారాయణ రావు సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో 'కోరినది నెరవేరినది' అంటూ సాగే పాట అప్పట్లో పెద్ద హిట్. 

అలాంటి ఈ సినిమాను కృష్ణ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీ రీ రిలీజ్ చేస్తున్నారు. 4K రిజల్యూషన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. భారీ తారాగణంతో ... భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.

More Telugu News