నెమలిని టార్చర్ పెట్టి చంపిన యువకుడు

Gruesome Video Of Man Torturing Peacock Viral
  • మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో వెలుగుచూసిన ఘటన
  • నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ మూగజీవికి నరకం చూపించిన వైనం
  • బాధలు తాళలేక నెమలి మృతి
  • ఘటనను కెమెరాతో రికార్డు చేసిన యువకుడు
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు 
నెమలిని టార్చర్ పెట్టి చంపేసిన ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం చూపించాడా యువకుడు. బాధ తాళలేక చివరకు అది మరణించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో వెలుగు చూసింది. వీడియో చూసిన నెటిజన్లు యువకుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. అతడికి కఠిన శిక్ష వేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. 

వీడియోలో కనిపించిన బైక్ ఆధారంగా నిందితుడిని అతుల్‌గా గుర్తించినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. అయితే, అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఇంట్లో అతడు లేడని చెప్పారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ తెలియగానే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించినట్టు తెలిపారు.
Advertisement
Madhya Pradesh

More Telugu News