దేవర... ఎన్టీఆర్ 30వ చిత్రం టైటిల్ ఇదే!

NTR 30th movie title Devara announced
  • ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం
  • పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రబృందం
  • రేపు (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు
  • అభిమానులకు ఒకరోజు ముందే గిఫ్ట్
  • టైటిల్ తో పాటు తారక్ ఫస్ట్ లుక్ కూడా విడుదల
అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ కు ఇది 30వ సినిమా కాగా, ఈ సినిమాకు 'దేవర' అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ టైటిల్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

రేపు (మే 20) తారక్ పుట్టినరోజు నేపథ్యంలో, ఆయన ఫ్యాన్స్ కు ఈ టైటిల్ అదిరిపోయే గిఫ్ట్ అని చెప్పాలి. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. చేతిలో నెత్తురోడుతున్న ఆయుధంతో ఎన్టీఆర్ నల్ల పంచె, నల్ల చొక్కా, కండువా ధరించి బీభత్సం ఉట్టిపడేలా కనిపిస్తున్నాడు. 

దేవర చిత్రం ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ప్రతినాయకుడు సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
Advertisement
Devara
NTR30
Title
Jr NTR
Koratala Siva
Tollywood

More Telugu News