ప్రేమించి పెళ్లి చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారు: సుప్రీంకోర్టు
- విడాకులకు వెయిటింగ్ పీరియడ్ అక్కర్లేదని ఇటీవల తీర్పు చెప్పిన సుప్రీం
- అన్ని సందర్భాలలో 6 నెలల వ్యవధి వర్తించదని వ్యాఖ్య
- మధ్యవర్తిత్వం కుదరనప్పుడు వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చని వెల్లడి
విడాకుల కోసం కోర్టును ఆశ్రయించే జంటలను కలిపి ఉంచేందుకు ప్రయత్నించాలనే ఉద్దేశంతో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13బి (2) లో ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ నిబంధన ఉంది. కోర్టును ఆశ్రయించిన జంటలకు ఆరు నెలల్లో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది. గడువు ముగిసిన తర్వాత కూడా కలిసి ఉండలేమని నిర్ణయించుకున్న జంటలకు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. అయితే, ఇటీవల ఓ కేసులో తీర్పు వెలువరిస్తూ.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే అన్ని జంటలకూ ఆరు నెలల నిబంధన వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పును ఉదహరిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరో జంటకు విడాకులు మంజూరు చేసింది.