ఫిల్మ్ స్టూడియో నిర్మాణంపై దృష్టి పెట్టిన ఎన్టీఆర్?.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
Add ap7am to your home Screen

ఫిల్మ్ స్టూడియో నిర్మాణంపై దృష్టి పెట్టిన ఎన్టీఆర్?.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

Ntr plans new studio
  • సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టిన ఎన్టీఆర్ 
  • ఇకపై బిజినెస్ వ్యవహారాలపై కూడా దృష్టి 
  • చిన్నపాటి స్టూడియో నిర్మాణాన్ని తలపెట్టినట్టుగా టాక్ 
  • త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్
ఇంతవరకూ ఎన్టీఆర్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చాడు. అలాంటి ఎన్టీఆర్ ఇక బిజినెస్ వ్యవహారాలపై కూడా దృష్టి పెడుతున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. స్టార్ హీరోలంతా ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున ఇతర బిజినెస్ లతో బిజీగా ఉన్నారు.

కొంతమంది హీరోలు సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటే .. మరికొంతమంది రెస్టారెంట్లు వంటి బిజినెస్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన స్నేహితులతో కలిసి ఓ స్టూడియో నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శంషాబాద్ సమీపంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ పనులు మొదలు పెడుతున్నారని అంటున్నారు. 

ఈ స్టూడియోలో సెట్స్ వేసుకుని షూటింగ్స్ చేసుకోవచ్చు. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్రేన్లు .. కెమెరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగులకు వాటిని రెంట్ కి ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   

Advertisement
Ntr
Actor
Tollywood

More Telugu News