ఓ కేసులో ఇమ్రాన్‌కు బెయిల్.. ఇటీవల హింస కేసులో నేడు లాహోర్ హైకోర్టుకు పీటీఐ చీఫ్!
- ఇమ్రాన్ ఖాన్‌పై వందకుపైగా కేసుల నమోదు
- విద్వేష పూరిత ప్రసంగం కేసులో జూన్ 8 వరకు బెయిలు
- గతవారం ఆరు కేసుల్లో మధ్యంతర బెయిలు
ఈ కేసులో ఇమ్రాన్ సోమవారం తన భార్య బుష్రా బీబీతో కలిసి లాహోర్ హైకోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు ఈ నెల 23 వరకు ప్రీ అరెస్ట్ బెయిలు మంజూరు చేసింది. కాగా, ఇమ్రాన్‌పై 100కుపైగా కేసులు నమోదయ్యాయి. తోషిఖానా (బహుమానాలు), అల్-కదీర్ ట్రస్ట్ కేసుల్లో ఆయన భార్య బుష్రాపైనా అభియోగాలు నమోదయ్యాయి.
లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ ఇంటిని తగలబెట్టడం, ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి పీటీఐ చీఫ్‌పై నమోదైన ఆరు కేసుల్లో గతవారం ఇమ్రాన్‌కు మధ్యంతర బెయిలు లభించింది.