Bhumika: ఆ విషయంలో వెబ్ సిరీస్ లే బెస్ట్: భూమిక

Web Series are best says Bhumika
షార్ట్స్‌లో చూడండి
సినీ పరిశ్రమలో హీరోల హవానే నడుస్తుందని సినీ నటి భూమిక అన్నారు. తన వయసులో సగం ఉన్న హీరోయిన్లతో నటించేందుకు హీరోలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. యువ హీరోయిన్లతో వయసు పెరిగిన హీరోలు నటించడాన్ని ప్రేక్షకులు, నిర్మాతలు కూడా అంగీకరిస్తున్నారని అన్నారు. పెద్దవారైన హీరోలతో నటించేందుకు యువ హీరోయిన్లు కూడా ఒప్పుకుంటున్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఈ విషయంలో వెబ్ సిరీస్ లే బెటర్ అని అన్నారు. వెబ్ సిరీస్ లలో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పారు.
Go Back to Shorts
Bhumika
Tollywood
Web Series

More Telugu News