Sarath Babu: నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల

Latest health bulletin on Sarath Babu condition
షార్ట్స్‌లో చూడండి
సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. కమల్ హాసన్ వంటి ప్రముఖుడు సైతం సోషల్ మీడియాలో ప్రచారం నిజమని నమ్మి, శరత్ బాబు ఇక లేరంటూ సంతాపం తెలిపి, ఆ తర్వాత తన ప్రకటన వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, ఏఐజీ ఆసుపత్రి శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చింది. 

శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, వెంటిలేటర్ పైనే ఉన్నారని వివరించింది. ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐజీ ఆసుపత్రి ఓ బులెటిన్ విడుదల చేసింది. ఆసుపత్రి వర్గాలు కానీ, శరత్ బాబు కుటుంబ సభ్యులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తుంటారని ఆ బులెటిన్ లో పేర్కొంది.
Go Back to Shorts
Sarath Babu
Health
Bulletin
AIG Hospital
Hyderabad

More Telugu News