ఒక్క సినిమా 32 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది తెలుసా?: నిర్మాత అశ్వనీదత్
- తెలుగు ఇండస్ట్రీలో వైజయంతీ బ్యానర్ స్థానం ప్రత్యేకం
- 'శక్తి' సినిమాతో 32 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడి
- బడ్జెట్ దాటి వెళ్లడమే అందుకు కారణమని వ్యాఖ్య
- అందువల్లనే గ్యాప్ వచ్చిందని స్పష్టీకరణ
తాజా ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ .. "ఆ రోజుల్లో పంపిణీ అంతా కూడా నిర్మాతలే చూసుకునేవారు. అందువలన నష్టం వస్తే దానిని నిర్మాతలు తట్టుకోలేకపోయేవారు. చేసిన అప్పులు తీర్చడానికి ఇళ్లు .. పొలాలు అమ్ముకున్నవారిని నేను చాలామందిని చూశాను. అలాంటివారిని చూసినప్పుడు నాకు భయం వేసేది. మరింత జాగ్రత్తగా ఉండాలనిపించేది" అని అన్నారు.
"నేను కూడా నష్టాలను చూసినవాడినే. అయితే ఎన్టీఆర్ హీరోగా చేసిన 'శక్తి' సినిమా విషయంలో బడ్జెట్ చేయిదాటిపోయింది. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు .. అందువలన 32 కోట్ల నష్టం వచ్చింది. ఒక సినిమా వలన 32 కోట్లను పోగొట్టుకోవడమనేది మామూలు విషయం కాదు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అంటూ చెప్పుకొచ్చారు.