NTR Centenary Celebrations: తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు... సినీ ప్రముఖులకు అవార్డులు

  • ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఇటీవల అంకురార్పణ
  • నేడు తెనాలి ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్సవాలు
  • హాజరైన బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, అల్లుడు భరత్
NTR Centenary Celebrations held in Tenali

ఏపీలో ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అంకురార్పణ జరగడం తెలిసిందే. ఈ క్రమంలో నేడు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ అందుకు వేదికగా నిలిచింది. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులను ఘనంగా సన్మానించారు. అలనాటి ప్రముఖ నటి భారతికి ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం అందజేశారు. సీనియర్ దర్శకుడు వాసుకు కూడా ఎన్టీఆర్ అవార్డు ప్రదానం చేశారు. 

తెనాలిలో జరిగిన ఈ వేడుకలకు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ హాజరయ్యారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు.

More Telugu News