Ram: బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోతున్న రామ్!

  • షూటింగు దశలో బోయపాటి మూవీ
  • రామ్ తదితరులపై యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న తమన్ 
  • అక్టోబర్ 20వ తేదీన సినిమా విడుదల
Ram and Boyapati movie update

రామ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేస్తున్నాడు. బోయపాటి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది తెలిసిందే. అదే రేంజ్ లో ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ఆయన డిజైన్ చేయించాడు. ఆ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించే పనిలో బోయపాటి ఉన్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ శివ అధ్వర్యంలో నిన్నటి నుంచి ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. భారీస్థాయిలో ఫైటర్లు ఈ సీన్స్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఈ సినిమా టీమ్ ఫారిన్ వెళ్లనుందని తెలుస్తోంది. 

ఫారిన్ లో ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. తమన్ బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు చెబుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి. 

More Telugu News