‘ఫెమీనా మిస్ ఇండియా’గా రాజస్థాన్ భామ నందినీ గుప్తా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఫెమీనా మిస్ ఇండియా’గా రాజస్థాన్ భామ నందినీ గుప్తా

 Nandini Gupta wins Femina Miss India 2023 Crown
  • మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో అట్టహాసంగా ఫైనల్ వేడుకలు
  • అందం, అభినయంతో ఆకట్టుకున్న 19 ఏళ్ల నందినీ గుప్తా
  • వేదికపై డ్యాన్స్ చేసి అలరించిన కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే
ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని ఈసారి 19 ఏళ్ల రాజస్థాన్ భామ నందినీ గుప్తా సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక 59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు.

చివరికి, తన అందం, అభియనంతో ఆకట్టుకున్న రాజస్థాన్‌లోని కోటాకు చెందిన నందినీ గుప్తా విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే వంటి సినీ తారలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 

కార్తీక్, అనన్య వేదికపై డ్యాన్స్ చేసి అలరించారు. అన్ని పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నందినీ గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి ఆమెకు కిరీటాన్ని తొడిగారు. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ వరుసగా మొదటి, రెండో రన్నరప్‌గా నిలిచారు.
Advertisement
Nandini Gupta
Femina Miss India 2023
Manipur
Ananya Panday
Kartik Aaryan
Sini Shetty

More Telugu News