kiran kumar reddy: నా ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి: కిరణ్ కుమార్ రెడ్డి

BJP is only option for me says Kiran Kumar Reddy
షార్ట్స్‌లో చూడండి
తన ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని... ఒకటి ప్రజా జీవితంలో ఉండాలా? లేక వద్దా? అనేవే తన ముందు ఉన్న ఆప్షన్లు అని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విజయవాడలోని బీజేపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువకుడిగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, సౌత్ జోన్ కు ఆడానని చెప్పారు. ఇప్పుడు గోల్ఫ్ ఆడుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారని... ఆ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని అన్నారు. తన ప్రైవేట్ లైఫ్ ను వదిలేసి, మళ్లీ ప్రజా జీవితంలోకి రావడానికి ప్రస్తుతం బీజేపీ మాత్రమే తన ముందు ఉన్న ఏకైక మార్గమని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని మీడియా ప్రతినిధులు అడగగా... కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అన్నారు. బీజేపీ గురించే మాట్లాడుకుందామని చెప్పారు. రాష్ట్ర విభజన చేయడం వల్ల కాంగ్రెస్ భారీగా నష్టపోతుందని కాంగ్రెస్ హైకమాండ్ కు ఆనాడు చెప్పినా వారు వినలేదని... అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని చెప్పారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు తన హయాంలో లేవని అన్నారు. 

బీజేపీ హైకమాండ్ తనకు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతలను స్వీకరిస్తానని చెప్పారు. తాను పదవిని ఆశించి బీజేపీలో చేరలేదని అన్నారు. పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తానని చెప్పారు. ఇకపై రెగ్యులర్ గా ఏపీకి వస్తానని అన్నారు. ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు.
Go Back to Shorts
kiran kumar reddy
BJP
Congress

More Telugu News