మహిళా అధికారిపై ఐఏఎస్ ఆఫీసర్ బూతుపురాణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా అధికారిపై ఐఏఎస్ ఆఫీసర్ బూతుపురాణం

IAS officer uses abusive language against female officer
  • జమ్మూకశ్మీర్‌లో అధికారిక వర్చువల్ మీటింగ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం
  • ‘బ్లడీ షిట్, స్టుపిడ్’ అంటూ అసభ్య పదజాలం
  • సస్పెండ్ చేసి, ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరింపులు
  • ఆవేశంలో అలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పిన ఐఏఎస్ అధికారి
  • ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు
జమ్మూకశ్మీర్‌లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, తన కింద పనిచేస్తున్న మహిళా అధికారిపై అధికారిక వర్చువల్ సమావేశంలో బూతు పురాణం అందుకున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి తొలగిస్తానని బెదిరించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

కార్మిక, ఉపాధి శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్న 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కుమార్ రాజీవ్ రంజన్, అక్టోబర్ 14న 'మిషన్ యువ' కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గందర్‌బాల్ ఎంప్లాయ్‌మెంట్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బెనిష్ వాని (2015 బ్యాచ్ జేకేఏఎస్ అధికారిణి) కాలికి గాయం కావడంతో ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

సమావేశంలో వాని తన శాఖ తరఫున వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, రంజన్ ఆమెను అడ్డుకున్నారు. ‘నోర్ముయ్.. నువ్వో బ్లడీ షిట్. నేను నీ బాస్‌ని, స్టుపిడ్’ అంటూ తీవ్రమైన పదజాలంతో దూషించారు. దీనిపై ఆమె అభ్యంతరం తెలపగా, వానిని సస్పెండ్ చేయడానికి ఉత్తర్వులు సిద్ధం చేయాలని, సర్వీస్ నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు లేఖ రాయాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు. దీనికి వాని ‘టు హెల్ విత్ యూ’ అని సమాధానమిచ్చి మీటింగ్ నుంచి నిష్క్రమించారు.

ఈ ఘటన తర్వాత వాని స్పందిస్తూ, ఆ వీడియో నిజమైనదేనని, దాన్ని మార్ఫింగ్ చేయలేదని స్పష్టం చేశారు. ‘మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. మమ్మల్ని ఎవరూ అలా చూడటానికి వీల్లేదు’ అని  అన్నారు.

ఈ వివాదంపై ఐఏఎస్ అధికారి రంజన్ స్పందిస్తూ, ఆవేశంలో అలా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. అయితే, ‘హెల్ విత్ యూ’ అంటూ వాని తనను రెచ్చగొట్టారని, గంటసేపు ఉన్న పూర్తి వీడియో చూస్తే వాస్తవం తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారిపై స్వతంత్ర విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Advertisement
Kumar Rajeev Ranjan
Benish Wani
Jammu and Kashmir IAS
IAS officer abusive video
Mission Yuva meeting
JKAS officer harassment

More Telugu News