స్కూల్లోకి చొరబడి 16 ఏళ్ల బాలుడి కాల్పుల మోత.. ముగ్గురు చిన్నారుల సహా నలుగురి మృతి
- అమెరికాలోని ఒరెగాన్ స్కూల్లో బాలుడి ఘాతుకం
- మృతుల్లో టీచర్..మరో టీచర్, విద్యార్థికి తీవ్ర గాయాలు
- నిందితుడిని వెంబడించి కాల్చి చంపిన సామాన్య పౌరుడు
అమెరికాలోని ఒరెగాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో 16 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని ఓ సామాన్య పౌరుడు వెంబడించి కాల్చి చంపాడు.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. ఓ పొడవాటి గన్తో పాఠశాలలోకి ప్రవేశించిన నిందితుడు, తాళం వేసి ఉన్న డోర్లను కాల్చుకుంటూ లోపలికి చొరబడ్డాడు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులు, ఒక టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో టీచర్, ఏడేళ్ల విద్యార్థి తీవ్రంగా గాయపడగా, వారిని సెయింట్ చార్లెస్ మెడికల్ సెంటర్కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం 12:59 గంటలకు స్కూల్ సమీపంలో కాల్పులు జరుగుతున్నట్లు పోలీసులకు తొలి సమాచారం అందింది. నిమిషాల వ్యవధిలోనే పాఠశాలలో కాల్పులు జరుగుతున్నట్లు వరుసగా ఫోన్లు వచ్చాయి. మధ్యాహ్నం 1:02 గంటలకు పోలీసులు స్కూల్ వద్దకు చేరుకునేసరికే, నిందితుడు బుల్లెట్ గాయాలతో మృతి చెంది ఉన్నాడు. దుండగుడు పాఠశాలలోకి ప్రవేశించడాన్ని గమనించిన ఓ పౌరుడు అతడిని వెంబడించి కాల్చి చంపినట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంట్జ్ తెలిపారు.
ఈ ఘటనతో బెండ్-లా పైన్ స్కూల్ డిస్ట్రిక్ట్లోని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఎఫ్బీఐ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఎవరు? అతడికి పాఠశాలతో ఏమైనా సంబంధం ఉందా? కాల్పులకు కారణమేంటి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఊహించని దాడితో తమ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, ఇది మాటల్లో చెప్పలేని విషాదమని పాఠశాల సూపరింటెండెంట్ స్టీవెన్ కుక్ ఆవేదన వ్యక్తం చేశారు.