Project K: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’లో రైడర్స్ ఎవరు?

  • ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కొత్త చిత్రం
  • భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా
  • హీరోయిన్ గా దీపిక పదుకొణే, కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్
Project K  From Skratch Ep2 Assembling The Raiders

రెబల్ స్టార్ ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాంతో, దీనిపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.  ప్రీ-ప్రొడక్షన్ పనులకు సంబంధించిన వీడియోలను చిత్రబృందం ఇప్పుడు విడుదల చేస్తోంది. ‘ఫ్రమ్ స్ర్కాచ్’ అంటూ తొలి ఎడిసోడ్ లో ఓ టైర్ ను తయారు చేసిన వీడియోను యూట్యూబ్ లో షేర్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు రైడ‌ర్స్‌కి దుస్తులు ఎలా తయారు చేశారో చూపెట్టింది.

అంతా స్క్రాచ్ నుంచే అంటూ మొదలైన వీడియోలో.. అందరూ రైడర్స్ అంటే ఎవరు? అనే ప్రశ్నించారు. రైడర్స్ ఈ చిత్రంలో ప్రతినాయకులు అని తెలుస్తోంది. వాళ్లు ప్రత్యేకమైన డ్రెస్సుల్లో కనిపించనున్నారు. వారి కోసం దుస్తులను ఎలా తయారు చేశారో కాస్ట్యూమ్ డిజైనర్, ఇతరులు వివరించారు. చిత్రం ప్రచారం కోసం ఈ వీడియోను విడుదల చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా హాలీవుడ్ ప్రాజెక్ట్‌ల కోసం ఈ రకమైన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతుంటాయి. ప్రాజెక్ట్ కె ను కూడా ఆ స్థాయిలోనే రూపొందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

More Telugu News