రామ్ - బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ఇదే!
- షూటింగు దశలో ఉన్న బోయపాటి మూవీ
- మాస్ యాక్షన్ జోనర్లో నడిచే కథ
- రామ్ సరసన అందాల సందడి చేయనున్న శ్రీలీల
- అక్టోబర్ 20వ తేదీన ఐదు భాషల్లో విడుదల
ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైన దగ్గర నుంచి కూడా అప్ డేట్స్ పెద్దగా ఇవ్వకుండా సైలెంట్ గా పని కానిచ్చేస్తూ వస్తున్నారు. దాంతో అసలు ఈ సినిమాను ఎప్పుడు బరిలోకి దింపనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో దున్నపోతును కంట్రోల్ చేసే మాస్ హీరోగా ఈ పోస్టర్లో రామ్ కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.