ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ముహూర్తం ఖరారు
- ఈ నెల 23న మొదలు కానున్న చిత్రీకరణ
- ట్విట్టర్ లో ప్రకటించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
- ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులోకి అరంగేట్రం
ఎన్టీఆర్ 30 సినిమా చిత్రీకరణ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. బ్యానర్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. 23న ముహూర్తం పూజతో సినిమా మొదలవుందని ప్రకటించింది. తారక్, జాన్వీ కపూర్, కొరటాల శివ, నంద మరళి కల్యాణ్, అనిరుధ్ అఫీషియల్, రత్నవేలడాప్, శ్రీకర్ ప్రసాద్, సాబుసైరిల్, యువ సుధా ఆర్ట్స్ కు ట్యాగ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చివరిగా నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందడంతోపాటు, ప్రతిష్టాత్మక అవార్డులను సైతం గెలుచుకుంటున్న విషయం తెలిసిందే.