బీజేపీలో చిచ్చు రేపిన కవిత అంశం.. ఎంపీ అర్వింద్ పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
- కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం
- సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న ధర్మపురి అర్వింద్
- సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను అర్వింద్ వెనక్కి తీసుకోవాలన్న రాజాసింగ్
మరోవైపు అర్వింద్ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ... బండి సంజయ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అర్వింద్ వెనక్కి తీసుకోవాలని అన్నారు. సంజయ్ మాటలు వ్యక్తిగతం కాదని... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే మాట్లాడారని చెప్పారు. అర్వింద్ కు ఏదైనా ఇబ్బంది ఉన్నా, సందేహాలు ఉన్నా నేరుగా సంజయ్ తో మాట్లాడాలని... మీడియా ముందు డైరెక్ట్ గా మాట్లాడటం సరికాదని అన్నారు.