ఆస్కార్ అప్‌డేట్స్: అట్టహాసంగా అవార్డుల వేడుక.. ‘నాటునాటు’పాటకు ఊగిపోయిన థియేటర్!
- మొదలైన ఆస్కార్స్ వేడుక
- హాలీవుడ్ తారలతో థియేటర్ కళకళ
- ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు అందుకున్న జేమ్స్ ఫ్రెండ్
- ఉత్తమ లైవ్ షార్ట్‌గా ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’
- ‘నవల్నీ’కి ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు
ఇక, ఇప్పటి వరకు ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకు గాను జేమ్స్ ఫ్రెండ్స్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్ అవార్డు అందుకోగా, ఈ ఏడాది ఉత్తమ లైవ్ షార్ట్‌గా ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’కి అవార్డు దక్కింది. టామ్ బెరిక్లీ, రోజ్‌వైట్ ఈ అవార్డును అందుకున్నారు. ఇక, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు ‘నవల్నీ’ సొంతమైంది.