తమ్మారెడ్డిపై టాలీవుడ్ ప్రముఖుల ఎదురుదాడి
Add ap7am to your home Screen

తమ్మారెడ్డిపై టాలీవుడ్ ప్రముఖుల ఎదురుదాడి

Tammareddy faces criticism over his remarks on RRR
  • ఆర్ఆర్ఆర్ పై విమర్శలు చేసిన తమ్మారెడ్డి
  • ఆస్కార్ ప్రమోషన్స్ కు రూ.80 కోట్లు ఖర్చు చేశారని వెల్లడి
  • తమకిస్తే 8 సినిమాలు తీసి ముఖాన కొడతామని వ్యాఖ్యలు
  • రూ.80 కోట్ల ఖర్చుకు నీ దగ్గర లెక్కలు ఉన్నాయా అని ప్రశ్నించిన రాఘవేంద్రరావు
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఖర్చులు రూ.80 కోట్లు అని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తీసి మీ ముఖాన కొడతాం అని సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. 

మిత్రుడు భరద్వాజ్ కు అంటూ ఓ సందేశం వెలువరించారు. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలని రాఘవేంద్రరావు హితవు పలికారు. అంతేకానీ, 80 కోట్లు ఖర్చు అనడం సరికాదని, అయినా రూ.80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర ఏదైనా అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉందా? అంటూ తమ్మారెడ్డిని నిలదీశారు. ఒకవేళ జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పదనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అని రాఘవేంద్రరావు ప్రశ్నించారు. 

అటు, మెగాబ్రదర్ నాగబాబు అంతకంటే ఘాటుగా స్పందించారు. ఇది ఎవరికి తగిలితే వారికి అంటూ రాయడానికి వీల్లేని భాషలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బ్రాకెట్లో ఆర్ఆర్ఆర్ మీద కామెంటుకు వైసీపీ వారి భాషలో సమాధానం అని చురక అంటించారు.
Advertisement
Tammareddy Bharadwaj
Raghavendrarao
Nagababu
RRR
Oscars
Tollywood

More Telugu News