నేను పుట్టింది రేపల్లెలో.. చచ్చేది మాత్రం ఇక్కడే..!: ఏపీ మంత్రి అంబటి రాంబాబు
- సత్తెనపల్లి ప్రజలు తనకు ఎంతో గౌరవం ఇచ్చారన్న రాంబాబు
- జనసేన అమ్ముడుపోయే పార్టీ అని విమర్శలు
- వైసీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని వ్యాఖ్య
గత టీడీపీ ప్రభుత్వం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు తీరని నష్టం వాటిల్లిందని మంత్రి విమర్శించారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ మీదుగా నీరు ప్రవహించడం వల్ల అది దెబ్బతిన్నదని చెప్పారు. కాఫర్ డ్యామ్ పనుల్ని పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వేయడం వల్ల తీరని నష్టం వాటిల్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్లే పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు.