Surya: ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన సూర్య, జ్యోతిక?

Surya and Jyothika devided from combined family
షార్ట్స్‌లో చూడండి
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత అందమైన జంట సూర్య, జోతిక. ప్రేమ వివాహం చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు సూర్యది ఉమ్మడి కుటుంబం. తండ్రి శివ కుమార్, తమ్ముడు కార్తీ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. సూర్య, జ్యోతికల పెళ్లి అయినప్పటి నుంచి కూడా వీరు వేరు కాపురం పెట్టలేదు. తామంతా ఇప్పటికీ సంతోషంగా కలిసి ఉండటానికి వదిన జ్యోతికే కారణమని కార్తీ ఎన్నోసార్లు చెప్పాడు. 

అయితే, ఇప్పుడు ఆ కుటుంబం నుంచి సూర్య, జ్యోతిక బయటకు వచ్చారని కోలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా జ్యోతికే అంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి సూర్య ముంబైలో మకాం పెట్టాడని అంటున్నారు. ముంబైలో సూర్య ఇటీవలే కొత్త ఇంటిని కొనుగోలు చేశాడని... ఆ ఇంటికి వీరు షిఫ్ట్ అయ్యారని చెపుతున్నారు. 

వాస్తవానికి జ్యోతికను సూర్య పెళ్లి చేసుకోవడం ఆయన తండ్రికి ఇష్టం లేదని... అయితే కొడుకు ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారని సమాచారం. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించకూడదనే కండిషన్ ను ఆయన పెట్టారట. అయితే, జ్యోతిక మళ్లీ సినిమాలు చేస్తుండటాన్ని సూర్య తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారని... ఇంట్లో విభేదాలు రావడానికి ఇదే కారణమని చెపుతున్నారు. అయితే ఇందులో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Surya
Jyothika
Tollywood
Kollywood

More Telugu News