కళాతపస్వి కె.విశ్వనాథ్ అర్ధాంగి కన్నుమూత

K VIswanath wife Jayalakshmi passes away
  • కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం
  • ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూత
  • అప్పటి నుంచి అస్వస్థతో బాధపడుతున్న జయలక్ష్మి
  • నేడు గుండెపోటుకు గురైన వైనం
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూయగా, నేడు ఆయన అర్ధాంగి జయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. జయలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. కొన్నిరోజుల వ్యవధిలోనే కె.విశ్వనాథ్ దంపతులు ఈ లోకాన్ని వీడడం వారి కుటుంబ సభ్యులను మరింత విచారానికి గురిచేస్తోంది. 

జయలక్ష్మి వయసు 86 ఏళ్లు. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, జయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. 
Go Back to Shorts
Jayalakshmi
Demise
K Viswanath
Tollywood

More Telugu News