మహేశ్ బాబు-త్రివిక్రమ్ చిత్రం తాజా షెడ్యూల్ రేపటి నుంచి!
- మహేశ్ బాబు-త్రివిక్రమ్ కలకయిలో హ్యాట్రిక్ చిత్రం
- మహేశ్ బాబు కెరీర్ లో ఇది 28వ సినిమా
- ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి
- షూటింగ్ లో పాల్గొననున్న శ్రీలీల
ఈ సినిమాకు ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రేపటి నుంచి రెండో షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
అయితే, ఇందులో యువ అందాలభామ శ్రీలీల కూడా కీలకపాత్ర పోషిస్తోంది. రేపటినుంచి జరిగే షూటింగ్ లో శ్రీలీల కూడా పాల్గొననుంది. ఇటీవలే మహేశ్ బాబు ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రావడంతో ఈ చిత్రం తాజా షెడ్యూల్ కు రూపకల్పన చేశారు.