అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. వేడెక్కనున్న రాజకీయాలు
- మార్చి 12న అమిత్ షా పర్యటన
- అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాక
- అదే రోజు ఓ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భారీ సభ ఉండే చాన్స్
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన ఉంటుందని అంటున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసింది. దీనికి మంచి స్పందనే వస్తుంది. మార్చి 12న నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో అమిత్ షా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.