Mahesh Babu: వెయ్యికోట్ల బడ్జెట్ .. 30 భాషల్లో మహేశ్ తో రాజమౌళి మూవీ!

  • 'ఆర్ ఆర్ ఆర్'కి అనూహ్యమైన స్పందన 
  • 1250  కోట్లకి పైగా గ్రాస్ వసూలు
  • మహేశ్ సినిమాకి సంబంధించి మొదలైన సన్నాహాలు 
  • ముందుగానే మార్కెటింగ్ పనులు చక్కబెడుతున్న రాజమౌళి
Mahesh and Rajamouli movie update

రాజమౌళి నుంచి వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ పొందింది. సినీ మేథావుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. 450 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 1250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో రాజమౌళి రూపొందించనున్న తరువాత సినిమాపై అందరూ దృష్టిపెట్టారు. 

రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉండనుంది. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా సమాచారం. అందుకు తగిన మార్కెటింగ్ ను కూడా ముందుగానే మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. 

ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే దాదాపు 30 భాషల్లోని ప్రేక్షకులకు ఈ సినిమా చేరువయ్యేలా ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకునే రాజమౌళి రంగంలోకి దిగుతాడనే విషయం తెలిసిందే. 

More Telugu News