మహిళల టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ చేరాలంటే భారత్ చేయాల్సింది ఇదే!
- ప్రస్తుతం గ్రూప్2లో రెండో స్థానంలో హర్మన్ ప్రీత్ సేన
- నేడు ఐర్లాండ్‌తో మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీఫైనల్ కు
- సా. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఈ నేపథ్యంలో భారత్.. ఐర్లాండ్ పై గెలిస్తే ఆరు పాయింట్లతో ఇతర గణాంకాలతో పని లేకుండా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. ఒకవేళ పాక్ చేతిలో ఇంగ్లండ్ ఓడితే భారత్ కు గ్రూప్ లో అగ్రస్థానం చేరుకునే అవకాశాలూ ఉంటాయి. అది జరగాలంటే ముందుగా ఐర్లాండ్ పై భారీ విజయం సాధించి రన్ రేట్ పెంచుకోవాలి. అందుకు భారత బ్యాటర్లు చెలరేగి ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఐర్లాండ్ చేతిలో ఓడినా భారత్ కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. కానీ, చాలా స్వల్ప తేడాతో ఓడి రన్ రేట్ కాపాడుకోవాలి. అదే సమయంలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడితేనే రన్ రేట్ ఆధారంగా భారత్ ముందుకెళ్తుంది.