ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పట్ల పెద్ద మనసు ప్రదర్శించిన బాలయ్య

Balakrishna gives helping hand to an assistant director
  • బోయపాటి శ్రీను వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న మహేశ్ యాదవ్
  • బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వైనం
  • శస్త్రచికిత్సకు రూ.40 లక్షలు అవుతుందన్న డాక్టర్లు
  • బాలయ్య మాటతో బసవతారకంలో ఉచితంగా శస్త్రచికిత్స
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పట్ల పెద్ద మనసు చాటుకున్నారు. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు మహేశ్ యాదవ్. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను టీమ్ లో పనిచేస్తున్నాడు. అయితే, ఆ సహాయ దర్శకుడు మెదడులో కణితితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.40 లక్షలు కావాల్సి ఉండగా, అతడి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. 

అత్యవసరంగా చికిత్స చేయించాలని డాక్టర్లు చెప్పడంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కుటుంబ సభ్యులు దాతల కోసం చూశారు. కాగా, బోయపాటితో పలు హిట్ సినిమాలు చేసిన బాలయ్యకు... బోయపాటి టీమ్ లోని వారితో సత్సంబంధాలు ఉన్నాయి. సదరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన చలించిపోయారు. 

అతడికి హైదరాబాదులోని తమ బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. రూ.40 లక్షల ఖర్చుతో కూడిన శస్త్రచికిత్స బాలకృష్ణ చలవతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగానే నిర్వహించారు. కాగా, బాలయ్య మంచి మనసు పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Balakrishna
Assistant Director
Brain Tumor
Boyapati Sreenu
Tollywood

More Telugu News