Samantha: 'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Shaakuntalam New Release Date
షార్ట్స్‌లో చూడండి
సమంత అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. గుణశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరించగా, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. శకుంతలగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసినట్టుగా ఇటీవల ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

ఈ సినిమా నుంచి ఇంతవరకూ రిలీజ్ చేసిన పాటలు చూస్తే, మణిశర్మ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. గుణశేఖర్ ఈ సినిమాను దృశ్య కావ్యంగా మలచినట్టుగా అర్థమవుతోంది. సమంత నాయిక ప్రధానమైన పాత్రను పోషించిన ఫస్టు పాన్ ఇండియా మూవీగా 'శాకుంతలం' గురించి చెప్పుకోవచ్చు.
Go Back to Shorts
Samantha
Dev Mohan
Mohan Babu
Prakash Raj
Shaakuntalam Movie

More Telugu News