Ravichandran Ashwin: నాగపూర్ టెస్టు: అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు... కుంబ్లే రికార్డు తెరమరుగు

Aswin gets his 450th wicket and set a record
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఇవాళ ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా అశ్విన్ 450 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత బౌలర్లలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రికార్డును అశ్విన్ ఇప్పుడు తన పేరిట లిఖించుకున్నాడు. 

ఇప్పటివరకు ఈ రికార్డు లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే 450 వికెట్ల మైలురాయిని చేరుకునేందుకు 93 టెస్టులు ఆడగా, అశ్విన్ తన 89వ టెస్టులోనే ఈ 450 వికెట్ల ఘనత అందుకోవడం విశేషం. నాగపూర్ టెస్టులో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డు నెలకొల్పాడు. 

అయితే ప్రపంచ క్రికెట్లో వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ రెండోస్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో శ్రీలంక ఆఫ్ స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో నిలిచాడు. మురళీధరన్ కేవలం 80 టెస్టుల్లోనే 450 వికెట్లు పడగొట్టడం విశేషం.
Go Back to Shorts
Ravichandran Ashwin
Record
Anil Kumble
Nagpur
Australia

More Telugu News