టీజర్ లాంచ్ ఈవెంట్ కి రెడీ అవుతున్న 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి'
- ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
- నాగశౌర్య సరసన నాయికగా మాళవిక నాయర్
- రేపు జరగనున్న టీజర్ లాంచ్ ఈవెంట్
- సంగీతాన్ని అందించిన వివేక్ సాగర్
తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంటుకి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఈ నెల 9వ తేదీన .. అంటే రేపు హైదరాబాదు .. బంజారా హిల్స్ లోని 'ఆర్కే సినీ ప్లెక్స్'లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. చైతూ 'థ్యాంక్యూ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మాళవిక నాయర్, ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. ఇక ఆమె నుంచి రావడానికి 'అన్నీ మంచి శకునములే' సినిమా కూడా లైన్లోనే ఉంది.