Soori: ఫారెస్టు నేపథ్యంలో 'విడుదలై' .. ధనుశ్ పాడిన పాట రిలీజ్!

Viduthalai movie frist single released
షార్ట్స్‌లో చూడండి
కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా సూరికి మంచి పేరు ఉంది. ఆయన హీరోగా రూపొందిన సినిమానే 'విడుదలై'. ఆర్.ఎస్. బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. 

'ఒన్నాడా నడంధా' అంటూ ఈ పాట సాగుతోంది. ఫారెస్టు నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ సాంగ్ ను బట్టి అర్థమవుతోంది. ఫారెస్టు ఆఫీసర్ పాత్రలో సూరి కనిపిస్తున్నాడు. ఓ పౌర్ణమినాటి రాత్రి ఆయన ఒక యువతితో కలిసి నడుస్తుండగా ఈ పాట ప్లే అవుతోంది. 

ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట మంచి ఫీల్ తో కనెక్ట్ అవుతోంది. ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తోంది. ఈ పాటను అనన్య భట్ తో కలిసి ధనుశ్ ఆలపించడం విశేషం. విజయ్ సేతుపతి .. ప్రకాశ్ రాజ్ .. గౌతమ్ మీనన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

Go Back to Shorts
Soori
Vijay Sethupathi
Prakash Raj
Viduthalai Movie

More Telugu News