టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు క్రికెటర్ గొంగడి త్రిషకు ఘన స్వాగతం

Grand well come to the telangana cricketer g trisha at shamshabad airport
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అధికారులు, క్రీడాభిమానులు
  • ఇంగ్లండ్ తో ఫైనల్లో టాప్ స్కోరర్ గా నిలిచిన త్రిష
ఐసీసీ మహిళల అండర్19 టీ20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషకు ఘన స్వాగతం లభించింది. టోర్నీ ముగిసిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన త్రిషకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ టోర్నీలో త్రిషతో పాటు ఓ మ్యాచ్ లో భారత జట్టుకు ఆడిన హైదరాబాద్ క్రీడాకారిణి యశశ్రీ, జట్టుకు ఫిట్ నెస్ ట్రెయినర్ గా వ్యవహరించిన శాలినీలకు కూడా మంత్రి, క్రీడాశాఖ అధికారులు పుప్ఫగుచ్ఛాలు అందించారు. 

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో త్రిష 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించింది. క్రికెటర్లు, వారి తల్లిదండ్రులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. త్రిషకు స్వాగతం పలికేందుకు అధికారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
Advertisement
T20 World Cup
womens cricket
u19 world cup
india
g trisha
telangana

More Telugu News