కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
- ప్రజల ఆందోళనలను పట్టించుకోలేదన్న చిదంబరం
- కేంద్రానికి ఎవరిపై మక్కువ ఉందో మరోసారి అర్థమయిందని వ్యాఖ్య
- ధరల పెరుగుదలపై ప్రస్తావన లేదని మండిపాటు
పన్నుల ఉపశమనం కూడా తగినంత లేదని చిదంబరం అన్నారు. పరోక్ష పన్నులను కూడా తగ్గించలేదని విమర్శించారు. ఇంధనం, నిత్యావసరాలు, ఎరువుల ధరలు పెరగడంపై ప్రస్తావన లేదని చెప్పారు. దేశంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని... పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం పెరుగుతోందని అన్నారు. దేశ జనాభాలోని ఒక శాతం మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమయిందని చెప్పారు. ఆర్థిక రాజధానులను, ఇతర నగరాలను పట్టించుకోకుండా అహ్మదాబాద్ కు ప్రాధాన్యతను ఇచ్చారని విమర్శించారు.