కుప్పకూలిన 3 యుద్ధ విమానాలు.. మధ్యప్రదేశ్ లో రెండు.. రాజస్థాన్ లో ఒకటి
- శిక్షణ విమానాలు ఢీ కొని నేలకూలిన వైనం
- కొనసాగుతున్న సహాయక చర్యలు.. పైలట్లు క్షేమం
- రాజస్థాన్ లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం
ఆపై మంటల్లో చిక్కుకోవడంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని సమాచారం. రాజస్థాన్ లో జరిగిన మరో ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి కూలిపోయింది. భరత్ పూర్ లో ఐఏఎఫ్ విమానం నేలకూలినట్లు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో పైలట్ క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది.