చత్తీస్ గఢ్ లో నిరుద్యోగులకు భృతి.. ప్రకటించిన సీఎం
- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తామన్న భూపేశ్ భాగెల్
- ఏప్రిల్ నుంచి నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందే అవకాశం
- నిరుద్యోగ భృతి ఇస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బస్తర్ జిల్లా జగ్దాల్ పూర్ లో గురువారం జాతీయ జెండాను భూపేశ్ భాగెల్ ఆవిష్కరించారు. తర్వాత ఆయన పలు ప్రకటనలు చేశారు. రాయ్ పూర్ ఎయిర్ పోర్టు దగ్గర్లో ఏరోసిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సౌకర్యాలను మెరుగుపరిచేందుకు, విమానాశ్రయ ప్రాంత అభివృద్ధి కోసం, ఉపాధి కల్పన కోసం ఏరోసిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికులకు గృహ నిర్మాణ సాయం చేస్తామని, మూడేళ్ల పాటు రూ.50 వేల గ్రాంట్ అందజేస్తామని వివరించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ముఖ్య హామీల్లో నిరుద్యోగ భృతి కూడా ఒకటి. ఈ ఏడాది ఆఖర్లో చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతిపై ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.