Kalyan Ram: 'అమిగోస్' నుంచి వీడియో సాంగ్ రిలీజ్!

  • కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'అమిగోస్'
  • డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న కల్యాణ్ రామ్ 
  • దర్శకుడిగా రాజేంద్రరెడ్డి పరిచయం 
  • వచ్చేనెల 10వ తేదీన విడుదల కానున్న సినిమా 
Amigos movie update

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'అమిగోస్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ అనే కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఎక ఎక ఎకా .. ఎక్కడున్నా స్నేహం వెతికాం, పక పక పక ఇక్కడికి వచ్చి ఒకరికి ఒకరం దొరికాం' అంటూ ఈ పాట సాగుతోంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. 

ఈ పాటలో కల్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేసే క్రమంలో వచ్చే పాట ఇది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కథాకథనాల పరంగా కల్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి.

More Telugu News