ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోతో ఎన్టీఆర్ హాలీవుడ్ చిత్రం?
- ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్
- ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల్లో హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన టాలీవుడ్ స్టార్
- ఓ జర్నలిస్టు ద్వారా మార్వెల్ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ తో భేటీ అయిన వైనం
ఈ క్రమంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కావడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు. వెంటనే మార్వెల్ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ విక్టోరియా అలోన్సోని ఎన్టీఆర్ కలుసుకోవడంతో దానికి పునాది పడినట్లు కనిపిస్తోంది. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానం తర్వాత జరిగిన పార్టీలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ విక్టోరియా అలోన్సోకి ఎన్టీఆర్ ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తాను మార్వెల్ చిత్రంలో భాగం కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు మార్వెల్ రూపొందించిన చిత్రాల్లో టోనీ స్టార్క్ తన అభిమాన పాత్ర అని ఎన్టీఆర్ చెప్పారు. తారక్ నిజంగానే మార్వెల్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థతో పని చేసి హాలీవుడ్ లో అడుగు పెడితే ఆయన అభిమానులకు అంతకుమించిన ఆనందం మరోటి ఉండబోదు.