బాబు-పవన్ బంధం బట్టబయలైంది: మంత్రి గుడివాడ అమర్నాథ్
- ఇటీవల పవన్ యువశక్తి సభ
- సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు
- అదేస్థాయిలో బదులిచ్చిన వైసీపీ మంత్రులు
- పవన్ ను ఎందుకు తిడుతున్నారన్న చంద్రబాబు
- చంద్రబాబుకు పవన్ సహధర్మచారిణి అన్న అమర్నాథ్
అసలు, జనసేన కంటే ముందు చంద్రబాబు స్పందిస్తున్నారని తెలిపారు. బాబు, పవన్ మధ్య బంధం ఇప్పుడందరికీ తెలిసిపోయిందని, ఆ బంధాన్ని సక్రమం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు.
చంద్రబాబు బెదిరింపులకు తమ కార్యకర్త కూడా భయపడడని స్పష్టం చేశారు. చంద్రబాబే పెద్ద సైకో అని, సొంత తమ్ముడ్ని గొలుసులతో కట్టేశాడని ఆరోపించారు. చంద్రబాబు వెనుక 5 కోట్ల మంది ఉంటే కుప్పం స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు.