కుప్పం వరదరాజస్వామికి ప్రత్యేక పూజలతో ప్రారంభం కానున్న లోకేశ్ పాదయాత్ర

Lokesh Padayatra will start with special prayers at Kuppam Varadaraja Swamy temple
  • జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
  • 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర
  • కుప్పం నుంచి ప్రారంభం
  • కుప్పం నియోజకవర్గంలో 29 కిలోమీటర్లు నడవనున్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు కొనసాగనున్న ఈ పాదయాత్ర జనవరి 27న ప్రారంభం కానుంది. కాగా, పాదయాత్రకు ముందు లోకేశ్ కుప్పం వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు లోకేశ్ పాదయాత్ర షురూ కానుంది. అనంతరం సాయంత్రం 4:45 గంటలకు పార్టీ ఆఫీస్ నుండి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.   కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పాటు 29 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగనుంది.
Go Back to Shorts
Nara Lokesh
Padayatra
Kuppam
Varadaraja Swamy Temple
TDP

More Telugu News