తారక్ తాతగారు, మా నాన్నకు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది: రామ్ చరణ్
- ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్
- అమెరికాలో సందడి చేస్తున్న చిత్రబృందం
- ఎన్టీఆర్ ఫ్యామిలీతో పోటీ గురించి చెప్పిన రామ్ చరణ్
తారక్ తాత గారు (ఎన్టీ రామారావు), తన తండ్రి చిరంజీవికి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని అన్నారు. 30 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య ఆరోగ్యకర పోటీ వాతావరణం ఉందని తెలిపారు. మెగా ఫ్యామిలీలోనే ఏడుగురు నటులం ఉన్నాం.... కజిన్స్ తో కూడా పోటీ ఉంటుంది అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి తనను, తారక్ ను ఎంపిక చేశారని, తారక్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నానని వెల్లడించారు.