Advertisement

చంద్రబాబు ప్రశంసకు జూనియర్ ఎన్టీఆర్ స్పందన

Junior NTR response to Chandrababu tweet
  • గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును కైవసం చేసుకున్న 'నాటునాటు' సాంగ్
  • 'ఆర్ఆర్ఆర్' టీమ్ పై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు
  • థాంక్యూ మామయ్య అంటూ ప్రతిస్పందించిన తారక్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచ వేదికలపై సత్తా చాటుతోంది. తెలుగు సినిమా ఖ్యాతిని నలుమూలలా చాటుతోంది. ఈ చిత్రంలోని 'నాటునాటు' సాంగ్ ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును కైవసం చేసుకుని... ఆ ఘనతను సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఖ్యాతిని సాధించింది. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' యూనిట్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. 

గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును 'ఆర్ఆర్ఆర్' చిత్రం సాధించడం సంతోషంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి, యావత్ టీమ్ సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేశారు. తాను గతంలో చెప్పిన విధంగానే తెలుగు ఇప్పుడు ఇండియన్ సాఫ్ట్ పవర్ గా మారిందని చెప్పారు. చంద్రబాబు ప్రశంసలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. 'థాంక్యూ సో మచ్ మామయ్య' అని ట్వీట్ చేశాడు.
Advertisement
Chandrababu
Telugudesam
Junior NTR
Tollywood
RRR

More Telugu News