విభజన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్... సుప్రీంకోర్టులో విచారణ
- ఆస్తుల విభజన సరిగా జరగలేదన్న ఏపీ ప్రభుత్వం
- న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్
- గైర్హాజరైన తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు
- తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
అయితే నేటి విచారణకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, సుప్రీం ధర్మాసనం తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటు, కౌంటర్ పై రిజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.