రొంపిచెర్లలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి.. ఉద్రిక్తత
- టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో ఉద్రిక్తత
- రాళ్లదాడిలో పలువురికి గాయాలు
- చిత్తూరు నుంచి అదనపు బలగాలు తెప్పించి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
దీంతో కాసేపటికి అక్కడికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. వారు అక్కడికి రాగానే వైసీపీ శ్రేణులు రాళ్లు, బీరు సీసాలతో వారిపైకి దాడులకు దిగారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడికి దిగారు. అరంగటపాటు ఇలా ఇరు వర్గాలు రాళ్లదాడికి దిగడంతో అక్కడున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు.
రాళ్ల దాడిలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చిత్తూరు నుంచి అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.