టీషర్టుతో చలిని ఎలా ఎదుర్కోవాలో ఓ వీడియో రూపొందిస్తా: రాహుల్ గాంధీ

టీషర్టుతో చలిని ఎలా ఎదుర్కోవాలో ఓ వీడియో రూపొందిస్తా: రాహుల్ గాంధీ

Rahul Gandhi funny answer on his T Shirt
  • భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ
  • డిసెంబరు 24న ఢిల్లీ చేరిక
  • ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • అంత చలిలోనూ టీషర్టుతోనే కనిపించిన రాహుల్
  • చలిని ఎలా తట్టుకుంటున్నారని ప్రశ్నించిన మీడియా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 24న దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. రాహుల్ గాంధీ టీషర్టు, ప్యాంటుతో భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. 

అయితే, ఎముకలు కొరికే చలికి నెలవైన ఢిల్లీలోనూ ఆయన స్వెట్టర్ వేసుకోకుండా టీషర్టుపైనే కనిపించారు. రాహుల్ టీషర్టు వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతో ఆయనను ఈ విషయమై మీడియా ప్రశ్నించింది. 

అందుకు రాహుల్ గాంధీ సరదాగా బదులిచ్చారు. భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత... టీషర్టు ధరించి చలిని ఎదుర్కోవడం ఎలా? అనే వీడియో రూపొందిస్తానంటూ అందరినీ నవ్వించారు. 

తన టీషర్టుపై అందరికీ అంత బాధేంటో అర్థంకావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఢిల్లీలో తనకేమీ చలి అనిపించడంలేదని, ఒకవేళ చలి అని భావిస్తే అప్పుడు స్వెట్టర్ గురించి ఆలోచిస్తానని రాహుల్ అన్నారు.
Advertisement
Rahul Gandhi
T-Shirt
Winter
Video
Sweater
Bharat Jodo
New Delhi
Congress
India

More Telugu News