జగన్ సామాజికవర్గానికే పెద్దపీట.. మిగిలిన వారికి కత్తిపీట: అచ్చెన్నాయుడు
- పదవుల్లో సొంత సామాజికవర్గానికే పెద్దపీట వేస్తున్నారు
- బడ్జెట్ లో సైతం ఇతరులకు అన్యాయం జరుగుతోంది
- సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి
దామాషా ప్రకారం 17.08 శాతం ఉన్న ఎస్సీలకు రూ. 7 వేల కోట్లు, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రూ. 16 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా... ఎస్సీలకు రూ. 3 వేల కోట్లు, బీసీలకు రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని కులాలను సమానంగా ఆదరించాలని... కానీ, జగన్ ఆయన సామాజికవర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.