అంతటి దౌర్భాగ్య స్థితిలో నేను లేను: అంబటి రాంబాబు

Ambati Rambabu fires on Pawan Kalyan
  • మృతుడి కుటుంబానికి ఇచ్చిన పరిహారంలో లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు
  • పరిహారం ఇప్పించిందే తానన్న అంబటి
  • అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
మృతుడి కుటుంబానికి వచ్చిన పరిహారంలో వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు లంచం డిమాండ్ చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. ఇది తనపై జనసేన చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. మృతుడి కుటుంబానికి ఇచ్చే పరిహారం డబ్బుల్లో లంచం తీసుకునే దౌర్భాగ్య పరిస్థితిలో తాను లేనని ఆయన అన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించిందే తానని చెప్పారు. శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తి అంటూ పవన్ చేసిన విమర్శలపై స్పందిస్తూ... తాను శవాలపై పేలాలు ఏరుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తనను అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Advertisement
Ambati Rambabu
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News