ప్రియుడితో విభేదాలు.. చంపి డ్రమ్ములో తీసుకెళ్లి తగలబెట్టేసింది!
- డబ్బుల విషయంలో ప్రేయసీప్రియుల మధ్య విభేదాలు
- బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో స్నేహితుడితో కలిసి చంపేసిన ప్రియురాలు
- చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో ఘటన
దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడి ప్రియురాలు రాగిణి సాహును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. చంద్రభూషణ్-రాగిణి ప్రేమికులు. ఈ క్రమంలో రాగిణికి ప్రియుడు కొంతమొత్తం అప్పు ఇచ్చాడు. ఈ డబ్బు విషయంలో ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం ప్రియురాలిని చంద్రభూషణ్ బ్లాక్‌మెయిల్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ప్రియుడిపై పగ పెంచుకున్న రాగిణి తన స్నేహితుడైన నూతన సాహుతో కలిసి చంద్రభూషణ్‌ను హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి సమీపంలోని అడవికి తీసుకెళ్లి తగలబెట్టేసింది. దీంతో పోలీసులు రాగిణి, ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.